: కాశ్మీర్ పై పాక్ వాదన వినేవారేరి?: పాక్ మీడియా


ప్రభుత్వాలు తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల కారణంగా, కాశ్మీర్ పై పాకిస్తాన్ వాదనను వినేవారే లేకుండా పోయారని ప్రముఖ పాక్ దినపత్రిక 'ది డైలీ టైమ్స్' అభిప్రాయపడింది. కాశ్మీర్ పై ఇండియాతో నెలకొన్న వివాదాలను ఎన్నిసార్లు బయటి ప్రపంచానికి తెలియజేయాలని చూస్తున్నప్పటికీ లాభం లేకపోతోందని ఆ పత్రిక తన సంపాదకీయంలో వెల్లడించింది. కాశ్మీర్ వివాదం పరిష్కారం కన్నా ముఖ్యమైన సమస్యలు ఉండటం కూడా ఇందుకు కారణమని పేర్కొంది. అయితే, పాకిస్తాన్ సంస్కృతి, సంప్రదాయాల్లో కాశ్మీర్ భాగమని, ఎట్టి పరిస్థితుల్లో పాక్ వెనక్కు తగ్గబోదని తెలిపింది.

  • Loading...

More Telugu News