: సద్దాం ఉరితీతకు వాడిన తాడును వేలం వేస్తారట!


ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్ ను ఉరితీసేందుకు వినియోగించిన తాడును వేలం వేయనున్నారు. బిడ్డింగ్ ప్రారంభ ధరను రూ.43 కోట్లుగా నిర్ణయించినట్టు 'ద ఇండిపెండెంట్' పత్రిక పేర్కొంది. ఆ ఉరితాడు మువఫ్ఫాక్ అల్-రుబాయీ అనే మాజీ మంత్రి వద్ద ఉందట. ఆయనను సద్దాం గతంలో మూడు సార్లు తీవ్రంగా హింసించినట్టు తెలిసింది. ఆయన ఆ తాడును తన నివాసం లివింగ్ రూంలో ఉన్న సద్దాం ప్రతిమ మెడకు చుట్టి ఉంచారు. ఈ తాడును సొంతం చేసుకునేందుకు ఇద్దరు కువైట్ వ్యాపారవేత్తలతో బాటు, ఓ సంపన్న ఇజ్రాయెలీ కుటుంబం, ఒక బ్యాంకు, ఇరాన్ మత సంస్థ కూడా పోటీ పడుతున్నాయి.

  • Loading...

More Telugu News