: తిరుపతిని జల్లెడ పడుతున్న 1000 మంది పోలీసులు
ఇటీవలి కాలంలో తిరుపతి చుట్టుపక్కల అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోవడంతో వాటికి చెక్ పెట్టాలని పోలీసులు నిర్ణయించారు. ఇందులో భాగంగా సుమారు 1000 మందికి పైగా వివిధ విభాగాలకు చెందిన పోలీసులు తిరుపతి శివారు ప్రాంతాలను చుట్టుముట్టి జల్లెడ పడుతున్నారు. ఈ తెల్లవారుజామున కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ముమ్మర తనిఖీలను చేపట్టిన పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరందరి గుర్తింపు కార్డులు పరిశీలించి, గతంలో ఏమైనా నేరాలకు పాల్పడ్డారా? అన్న విషయాన్ని విచారిస్తున్నామని తెలిపారు.