: మీ మద్దతు అక్కర్లేదు!: బుఖారికి ఆమ్ ఆద్మీ పార్టీ షాక్
ఆమ్ ఆద్మీ పార్టీకి ముస్లింలంతా ఓటు వేయాలని, తాను కేజ్రీవాల్ కు మద్దతు ఇస్తానని జామా మసీదు షాహి ఇమామ్ సయ్యద్ బుఖారి చేసిన ప్రకటనను ఆ పార్టీ నేతలు తిరస్కరించారు. సయ్యద్ బుఖారితో తమకు ఎటువంటి బంధమూ లేదని, అలాంటి ప్రకటన ఎందుకు ఇచ్చారో ఆయనకే తెలియాలని ఆప్ నేత అశుతోష్ వ్యాఖ్యానించారు. తాము మత రాజకీయాలకు చరమగీతం పాడేందుకే కృషి చేస్తామని వివరించారు. బుఖారి మద్దతు తమకు వద్దని ఆయన అన్నారు.