: ఆలయాల్లో దొంగతనాలు చేసి... టీవీ ఛానల్ పెట్టాడు: పోలీసుల అదుపులో 'నవ్యాంధ్ర' ఎండీ


గుంటూరు కేంద్రంగా 'నవ్యాంధ్ర' పేరిట ఒక టీవీ ఛానల్ పెట్టి రిపోర్టర్లుగా నియమిస్తానంటూ, ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షలు వసూలు చేసిన న్యూస్‌ చానల్‌ ఎండీ సునీల్‌ ను నెల్లూరు రూరల్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆరు నెలల క్రితం నెల్లూరు రూరల్‌ మండలం గొల్లకందుకూరు గ్రామంలో కొత్తగా నిర్మించిన రామాలయంలో రూ.2 లక్షలు, మంగళసూత్రం, సజ్జాపురంలోని మరో ఆలయంలో అమ్మవారి మంగళసూత్రం అపహరించుకుపోయినట్లు రూరల్‌ పోలీసు స్టేషన్‌ లో ఇప్పటికే కేసు నమోదైంది. అంతకన్నా ముందు, భక్తవత్సలనగర్‌ ప్రాంతంలోని కృష్ణమందిరంలో 6 మంగళసూత్రాలతో పాటు కొంత నగదు, బంగారం తీసుకెళ్లినట్లు ఒక కేసు నమోదై ఉంది. ఓ రియల్‌ ఎస్టేట్‌ కార్యాలయంలో పని చేస్తూ నగదు అపహరించుకుపోగా, దాని నిర్వాహకులు ఇప్పటికీ సునీల్ కోసం గాలిస్తున్నట్టు సమాచారం. ఈ కేసులను సీరియస్ గా తీసుకున్న పోలీసులు సునీల్‌ ఫోన్‌ సంభాషణలపై నిఘా పెట్టి ఒంగోలులో ఉన్నాడని పసిగట్టి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలతో పాటు గుంటూరు, విజయవాడ, కర్నూలు ప్రాంతాల్లో అదనపు రిపోర్టర్లను నియమించుకుని లక్షల రూపాయలు వసూలు చేశాడని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలిసింది.

  • Loading...

More Telugu News