: చచ్చినట్టు సెలవులు తీసుకోవాల్సిందే... చట్టం తీసుకురానున్న జపాన్


యువత, పిల్లలు తక్కువైపోయి, వృద్ధుల సంఖ్య పెరిగిపోయిన జపాన్లో ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురానుంది. పనిలో పడి పిల్లల్ని కనడం మరచిపోయిన ప్రజల్లో భవిష్యత్తుపై అవగాహన కల్పించి, వారికి తగినంత విశ్రాంతిని ఇస్తూ, జనాభా సంఖ్యను పెంచేందుకు సెలవులను తప్పనిసరి చేయాలని భావిస్తోంది. పొద్దస్తమానం ఆఫీసే లోకం అనుకుంటూ, భార్యాభర్తల మధ్య ఏకాంతానికి తావులేక, దాంపత్య జీవితాన్ని అనుభవించలేక, అసలు అటువంటి ఆలోచనే లేక జపాన్ ప్రజలు కష్టపడుతుంటే, ఆ కష్టం ఇప్పుడు దేశాభివృద్ధిపై ప్రభావం చూపేలా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దీంతో కళ్లు తెరచిన ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ప్రతి ఉద్యోగి తన సెలవులు పూర్తిగా వాడుకోవాల్సిందేనని, వాళ్లు సెలవులను వాడుకునేలా చూసే బాధ్యత వారి పైఅధికారిదేనని చెబుతోంది. ఈ మేరకు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే చట్టం తేవడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

  • Loading...

More Telugu News