: మాటమీద నిలబడ్డ మలయాళ సూపర్ స్టార్


మలయాళ సూపర్‌ స్టార్ మోహన్‌ లాల్ మాటమీద నిలబడ్డారు. కేరళలో జరుగుతున్న జాతీయ క్రీడల ప్రారంభ వేడుకల సందర్భంగా ఆయన తన ట్రూపుతో సంగీత విభావరి నిర్వహించారు. ఇందుకోసం కేరళ ప్రభుత్వం నుంచి 1.63 కోట్ల రూపాయలను తీసుకున్నారు. ఈ కార్యక్రమంపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో, మోహన్ లాల్ ఆ చెక్కును తిరిగి ఇచ్చేశారు. కాగా, ప్రభుత్వం అందజేసిన చెక్కును తిరిగిచ్చేస్తానని మోహన్ లాల్ పేర్కోవడంతో, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్ చాంద్ దానిని తీసుకోమని, తిరస్కరిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. మోహన్ లాల్ అందజేసిన చెక్ ను అంగీకరించాలా? వద్దా? అన్న నిర్ణయంపై ఎలాంటి ఆదేశాలు అందలేదని క్రీడల నిర్వాహకులు చెప్పారు.

  • Loading...

More Telugu News