: అక్రమ నిర్మాణాన్ని తొలగించండి: షారూఖ్ ఖాన్ కి కార్పొరేషన్ నోటీసులు
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ముంబయిలో తన నివాసం 'మన్నత్' ఎదుట నిర్మించిన ర్యాంప్ ను తొలగించాలంటూ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల సమయం ఇస్తున్నామని చెప్పిన బృహన్ ముంబై కార్పొరేషన్, ఆ అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని ఆదేశించింది. లేని పక్షంలో ఆ ర్యాంప్ ను తామే తొలగించి, దానికి అయిన ఖర్చు బిల్లును షారూఖ్ కి పంపిస్తామని ఆ నోటీసుల్లో పేర్కొంది. కాగా, ఈ ర్యాంప్ కారణంగా పౌరులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతున్నాయని బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ జనవరి 29న మున్సిపల్ కమిషనర్ సీతారామ్ కుంతేకు లేఖ రాయడానికి తోడు, మరికొందరు స్థానికులు కూడా దీనిపై ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా, షారూక్ సన్నిహితులు అతనికి అలాంటి లేఖ ఏదీ అందలేదని పేర్కోవడం విశేషం.