: వాట్సప్ లో ఎమ్మెల్యే వ్యాఖ్యలు...'రూపాయి తీసుకోకుండా ఓటేసినవా?'?
తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు వ్యాఖ్యలు వాట్సప్ లో హల్ చల్ చేస్తున్నాయి. విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేస్తానన్న ఎన్నికల హామీపై కోరుట్ల నియోజకవర్గంలోని కోనరావుపేట నుంచి ఓ రైతు ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుకు ఫోన్ చేశారు. ఫోన్ రిసీవ్ చేసుకున్న ఎమ్మెల్యే తనను ఊరికే సతాయించవద్దని, తాను తిరుపతిలో ఉన్నానని కసురుకున్నారు. తాము ఓట్లేసి గెలిపించింది ఇందుకేనా? అని రైతు ప్రశ్నించడంతో కంగుతిన్న ఎమ్మెల్యే, 'వేసినవ్ లే...రూపాయి తీసుకోకుండా ఓటేసినవా? ఫోన్ పెట్టేయ్' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రైతు అవాక్కయ్యాడు. ఈ సంభాషణను రైతు వాట్సప్ లో అప్ లోడ్ చేశాడు. వాట్సప్ లో ఆ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.