: ఆ అక్కాచెల్లెళ్లపై అత్యాచారం జరగలేదు...కేసు మూసేయండి: సీబీఐ
ఉత్తరప్రదేశ్ లోని బదయూ జిల్లాలోని కత్రా గ్రామంలో గతేడాది మే నెలలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు చెట్టుకు వేలాడుతూ అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం జరగలేదని సీబీఐ పేర్కొంది. ఈ మేరకు కేసును మూసివేయాలని పేర్కొంటూ ఆధారాలతో నివేదికను కోర్టుకు సమర్పించింది. 91 పేజీల నివేదికను ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పీవోఎస్ఎస్ వో) కోర్టు జిల్లా అదనపు న్యాయమూర్తి జస్టిస్ అనిల్ కుమార్ కు, ఫిర్యాదుదారులకు అందజేసింది. ఇందులో 34 పేజీల మూసివేత నివేదిక, 2 పేజీలలో ఇద్దరు బాలికల పోస్టుమార్టం రిపోర్టు, 4 పేజీల సాక్షుల లిస్టు, మిగిలిన పేజీల్లో సాక్షులు చెప్పిన వివరాలు, డీఎన్ఏ, పోరెన్సిక్, స్టేటస్ రిపోర్టులున్నాయి. వీటిల్లో ఆ అక్కాచెల్లెళ్లిద్దరూ అత్యాచారానికి, హత్యకు గురయ్యారనడానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదని పేర్కొంది. దీంతో ఈ కేసును కోర్టు ఫిబ్రవరి 11కు వాయిదా వేసింది.