: నమ్మకమే పెట్టుబడి...విజయం సాధిస్తా: ఇండిపెండెంట్ ఛాయ్ వాలా విశ్వాసం


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ ఛాయ్ వాలా ఇండిపెండెంట్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. బలరాం బారి (59) ఢిల్లీ లోని ఛాందినీ చౌక్ లోని రోడ్డు పక్కన చిన్న టీ దుకాణం నడుపుతున్నాడు. లోక్ సభ, మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పటి వరకు 19 సార్లు వివిధ పదవులకు పోటీ చేశాడు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ పడుతున్నారు. ఆయన మాట్లాడుతూ, నమ్మకమే పెట్టుబడి అన్నారు. నామినేషన్ దాఖలు చేసేందుకు కూడా తన దగ్గర డబ్బు ల్లేవన్న ఆయన, తన భార్య, బంధువుల నుంచి నామినేషన్ కు డబ్బుతీసుకున్నానని తెలిపారు. తన దగ్గర, కారు, సెల్ ఫోన్ వంటి విలువైన వస్తువులు లేవన్న ఆయన, ప్రధాని కూడా తనలాగే ఒకప్పుడు ఛాయ్ వాలాయేనని గుర్తుచేశారు. ఎన్నో అడ్డంకులు దాటుకుని ఆయన ప్రధానిగా ఎదిగారని, ఆయన స్ఫూర్తిగానే తాను పోటీ చేశానని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News