: బీహార్ సీఎం, నితీష్ కుమార్ మద్దతుదారుల మధ్య ఘర్షణ
బీహార్ లో ముఖ్యమంత్రి మార్పు జరగబోతోందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో జేడీ (యూ)లో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. సీఎం మార్పుపై రేపు శాసనసభాపక్ష భేటీ జరగనున్న క్రమంలో బీహార్ సీఎం, నితీష్ కుమార్ మద్దతుదారులు రాష్ట్ర పార్టీ కార్యాలయం వద్ద ఘర్షణకు దిగారు. ఈ సమయంలో వ్యతిరేక నినాదాలు చేసిన మాంఝీ మద్దతుదారులు నితీష్ కుమార్ దిష్టిబొమ్మను తగులబెట్టారు. అధికార పార్టీలో అంతర్గత విభేదాలు వచ్చాయన్న ఆరోపణ తెరపైకి రావడంతో నితీష్, మాంఝీ మద్దతుదారులు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు.