: ఇప్పటి ఎలుక అప్పట్లో గేదె సైజులో వెయ్యి కేజీల బరువుతో ఉండేదట!


సాధారణంగా ఎలుక అంటే చిన్నసైజుతో, ఇంట్లోని రంధ్రాల్లో దూరిపోతూ నోటికి అందిన ప్రతిదానిని కొరికేస్తూ విసిగిస్తుంటుంది. ఇప్పుడంటే ఎలుక చిన్నగా, చేతిలో పట్టే సైజులో ఉంది కానీ, ఒకప్పుడు భీకరంగా ఉండేదట. 30 లక్షల ఏళ్ల క్రితం దక్షిణ అమెరికాలో సంచరించిన ఎలుక వెయ్యి కిలోల బరువుతో గేదె సైజులో ఉండేదట. ఇప్పటి వరకు కనుగొన్న అన్ని ఎలుక జాతి జంతువుల్లోనూ ఇదే పెద్దదట. గతంలో దొరికిన దీని పుర్రె, ఎముకలపై బ్రిటన్ లోని యూనివర్సిటీ ఆఫ్ యార్క్, హల్ యార్క్ మెడికల్ స్కూలు శాస్త్రవేత్తలు కంప్యూటర్ సాయంతో జరిపిన తాజా పరిశోధనలో ఇది వెల్లడైంది. గినియా పందులకు కాస్త దగ్గరి పోలికలతో ఉన్న ఈ ఎలుక జాతి జంతువు పేరు 'జొసెఫోఅర్టిగాసియా మోనెసీ'. దీనికి ముందర ఉన్నపళ్లకు పులిదంతాలంత బలం ఉండేదని, అయితే వీటిని ఏనుగు దంతాలను వినియోగించినట్టు వినియోగించుకునేదని వారు వెల్లడించారు. ఇతర జంతువులతో పోరాడేందుకు, ఆహారం తీసుకునేందుకు, నేలను తవ్వేందుకు మాత్రమే ఉపయోగించేదని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News