: తెలంగాణ మంత్రులంతా ఉత్సవ విగ్రహాలే: మోత్కుపల్లి


సచివాలయాన్నే అమ్మేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారని... సచివాలయాన్ని అమ్మాలనే ఆలోచన ఆయనకు ఎందుకు వచ్చిందని టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ప్రశ్నించారు. డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్యను పదవి నుంచి తొలగించి, మొత్తం దళిత జాతిని కేసీఆర్ అవమానించారని అన్నారు. కేసీఆర్ కేబినెట్లోని మంత్రులంతా ఉత్సవ విగ్రహాలుగా మారారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలన తుగ్లక్ పాలనను తలపిస్తోందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో మీడియా కూడా స్వేచ్ఛను కోల్పోయిందని అన్నారు.

  • Loading...

More Telugu News