: కంప్యూటర్ ఎలా ఉపయోగించాలో ఇప్పటికీ తెలియదు: పోప్
పోప్ ఫ్రాన్సిస్ (78) ప్రపంచ వ్యాప్తంగా కొందరు వికలాంగ బాలలతో ఆన్ లైన్ లో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ 16 ఏళ్ల బాలిక అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, తనకు కంప్యూటర్ ఎలా ఉపయోగించాలో ఇప్పటికీ తెలియదని చెప్పారు. సెల్ ఫోన్లు, ట్యాబ్ ల గురించి అస్సలు తెలియదని పేర్కొన్నారు. వాటికన్ లోని ఓ ఆడియెన్స్ హాల్ నుంచి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్కోలాస్ ఇనిషియేటివ్ కార్యక్రమంలో భాగంగా పోప్ చిన్నారుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. పిల్లలు తాము బెయిలీ కీపాడ్లు, ట్యాబ్లెట్లు, వీడియో కెమెరాలను వినియోగించడం ద్వారా ఎలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నామో పోప్ కు వివరించారు.