: హమ్మయ్య! ఓ పని పూర్తయింది... గుడిలో రొట్టెలు చేసిన కిరణ్, యోగాతో రిలాక్సయిన కేజ్రీవాల్


నిన్నటివరకూ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్న ఢిల్లీ రాజకీయ నేతలు నేడు సేదదీరారు. అందుకోసం ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకున్నారు. తమపై ప్రచార భారం దిగిపోగా, ఇక ప్రజల తీర్పు కోసం వేచి చూడాల్సిన స్థితిలో నేతలు రిలాక్స్ అయ్యారు. భారీస్థాయిలో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో ఎదుర్కొన్న ఒత్తిడిని అధిగమించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ యోగాను ఎంచుకోగా, బీజేపీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగిన కిరణ్ బేడీ భక్తి మార్గాన్ని అనుసరించారు. కిరణ్ బేడీ గురుద్వారాకు చేరుకుని అక్కడి భక్తులకు తానే స్వయంగా రొట్టెలను, భోజనాన్ని తయారుచేసి వడ్డించారు. ఈ విషయమై బేడీ మాట్లాడుతూ, తాను ఈ పనిని ఇప్పుడే మొదటిసారిగా చేయడం లేదని... భక్తులకు సేవలందించే అలవాటును తన కుటుంబం నుంచే అలవర్చుకున్నానని తెలిపారు.

  • Loading...

More Telugu News