: పాలమూరు ఎత్తిపోతలు, వాటర్ గ్రిడ్ లకు నిధులు మంజూరు


పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు తొలిదశ పనులకు తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇందులో వాటర్ గ్రిడ్ పనులకు రూ.1518.52 కోట్ల నిధులు మంజూరయ్యాయి. నీటి శుద్ధి యంత్రాలు, విద్యుత్ సరఫరా పనులకు కూడా నిధులు విడుదల చేశారు. 9 జిల్లాల్లో 26 సెగ్మెంట్ లకు వాటర్ గ్రిడ్ పనుల నివేదికను ఈ రోజు అధికారులు ప్రభుత్వానికి అందించారు. వాటర్ గ్రిడ్ కు కేజీ బేసిన్ లో 39.272 టీఎంసీలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాలమూరు ఎత్తిపోతల పథకానికి రూ.14,350 కోట్లు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి పాలన అనుమతులు ఇచ్చే ఫైల్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు.

  • Loading...

More Telugu News