: వాళ్లు టీమిండియాకు భారం: వెంగీ
గాయపడిన ఆటగాళ్లను కొనసాగించడం ద్వారా టీమిండియా తప్పు చేస్తోందని మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్ సర్కార్ అభిప్రాయపడ్డాడు. వరల్డ్ కప్ నేపథ్యంలో వాళ్లు టీమిండియాకు భారమని పేర్కొన్నాడు. టైటిల్ నిలబెట్టుకునే క్రమంలో ఇదో పెద్ద అడ్డంకి అని తెలిపాడు. గాయాలతో బాధపడుతున్న ఆటగాళ్లను బరిలో దింపరాదని సూచించాడు. అయితే, వారు కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పాడు. టీమిండియాలో ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ గాయాలతో సతమతమవుతున్నారు. వీరికి రేపు ఫిట్ నెస్ టెస్టు నిర్వహిస్తారు. ఇక, గత వరల్డ్ కప్ లో విశేషంగా రాణించిన యువరాజ్ సింగ్ కు, ప్రస్తుతం ఫాంలో ఉన్న మురళీ విజయ్ కు భారత జట్టులో చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నాడు.