: 700 శ్లోకాలతో సంపూర్ణ భగవద్గీత... ఏడేళ్ల బృహత్ యజ్ఞం


పవిత్రమైన భగవద్గీతను భక్తులకు అందించి, మహా గాయకుడు ఘంటశాల అమరుడయ్యారు. దశాబ్దాలు గడుస్తున్నా ఘంటశాల పాడిన భగవద్గీత శ్లోకాలు వన్నె కోల్పోలేదు. ఇప్పుడు ఆ మహా గాయకుడి స్పూర్తితో 'భగవద్గీత ఫౌండేషన్' వ్యవస్థాపకులు, సినీ గాయకుడు, సంగీత దర్శకుడు గంగాధరశాస్త్రి 'సంపూర్ణ భగవద్గీత' ఆడియోను రూపొందించారు. దివంగత ఘంటశాల కొంతమేర గానం చేసిన భగవద్గీతను, సంపూర్ణంగా (700 శ్లోకాలు) గానం చేసి, తెలుగు తాత్పర్య సహితంగా భక్తులకు అందజేయనున్నారు. ఈ బృహత్ యజ్ఞం పూర్తి కావడానికి 7 సంవత్సరాల సమయం పట్టింది. సుమారు 100 మందికి పైగా పండితులు, టెక్నీషియన్లు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భగవత్బంధువులు ఈ కార్యక్రమం కోసం ఎంతో సహాయసహకారాలు అందజేశారు. అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందిన ఈ ఆడియోను వింటే, ప్రత్యక్షంగా దర్శిస్తున్న అనుభూతి కలుగుతుందని గంగాధర శాస్త్రి తెలిపారు. ఫిబ్రవరి 11న, ఉదయం 9 గంటలకు అలిపిరి నుంచి పాదయాత్రగా బయలుదేరుతామని... స్వామివారి సన్నిధి చేరుకున్నాక, శ్రీవారి పాదాల చెంతన తొలి ప్రతిని ఉంచుతామని ఆయన తెలిపారు. పాదయాత్రను టీటీడీ ఈవో సాంబశివరావు జెండా ఊపి ప్రారంభిస్తారని చెప్పారు. దేశ చరిత్రలో భగవద్గీతను సంపూర్ణంగా అందించడం ఇదే ప్రథమమని గంగాధర శాస్త్రి అన్నారు.

  • Loading...

More Telugu News