: ప్రజలను వేధిస్తే ఊరుకోం: హిజ్రాలకు పోలీసుల వార్నింగ్
డబ్బుల కోసం ప్రజల వెంటపడి వేధిస్తూ వుంటే చూస్తూ ఊరుకోబోమని హిజ్రాలకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. రైళ్లలో ప్రయాణికుల పట్ల వారి ఆగడాలు ఎక్కువ కావడంతో 100 మందికి పైగా హిజ్రాలకు వరంగల్ పోలీసులు నేడు కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రయాణికుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించవద్దని వారికి సూచించారు. జుగుప్సాకరమైన కార్యక్రమాలకు పాల్పడి ఇబ్బందులు కలిగించవద్దని హెచ్చరించారు. మరోసారి అలాంటి పనులకు పాల్పడితే చట్టప్రకారం శిక్ష తప్పదని స్పష్టం చేశారు.