: తెలంగాణ ద్రోహి చంద్రబాబు: మరోసారి విరుచుకుపడ్డ కవిత
చంద్రబాబునాయుడు ముమ్మాటికీ తెలంగాణ ద్రోహేనని టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యురాలు కవిత విరుచుకుపడ్డారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా కవిత ప్రసంగించారు. చంద్రబాబు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ ను దేశం గర్వించదగ్గ నాయకుడిగా చేసింది పార్టీ కార్యకర్తలే అని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టించిన కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. తెలంగాణలో టీడీపీని నామరూపాల్లేకుండా చేయాలని పిలుపునిచ్చారు.