: మోడీ కాళ్ల వద్ద సీమాంధ్రుల ఆత్మాభిమానం తాకట్టు పెడుతున్నారు: రఘువీరా


సీమాంధ్రుల ఆత్మాభిమానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెడుతున్నారని ఆంధ్రప్రదేశ్ పీపీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాపై పార్లమెంట్లో పోరాడుతామని ఆయన అన్నారు. నేటి ఉదయం గోదావరి నదీమ తల్లికి నక్షత్ర పూజలు నిర్వహించేందుకు రాజమండ్రి వచ్చిన ఆయన 'ఏపీకి ప్రత్యేక హోదా సీమాంధ్రుల హక్కు' అని నినాదాలు చేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసేందుకు రాష్ట్ర బడ్జెట్లో రూ.10 వేల కోట్లు కేటాయించాలని రఘువీరా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇంతవరకు ఇవ్వని కేంద్రంపై టీడీపీ ఎందుకు ఒత్తిడి తేవడం లేదంటూ ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News