: 'కాశ్మీర్ డే' సందర్భంగా లాహోర్ లో హఫీజ్ సయీద్ ర్యాలీ
'కాశ్మీర్ డే' సందర్భంగా జమాత్ ఉద్ దవా అధినేత, ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ లాహోర్ లో భారీ ర్యాలీ నిర్వహించాడు. తన కార్యకర్తలతో నిర్వహించిన ఈ ర్యాలీలో హైకోర్టు వద్ద హఫీజ్ మాట్లాడుతూ, తాము కాశ్మీరీలమని, కాశ్మీరీలు తమతో ఉన్నారని అన్నాడు. తమ మతం అందరినీ ఒకే జాతిగా బంధించిందని, భారత సాయుధ దళాల క్రూరత్వానికి, అణచివేతకు గురైన తమ సోదరులకు తమ నైతిక మద్దతు కొనసాగుతుందని వ్యాఖ్యానించాడు. ఇటీవల భారత విదేశాంగ మంత్రి చైనా పర్యటనను ప్రస్తావించిన హఫీజ్, కాశ్మీర్ స్వాతంత్ర్యానికి వ్యతిరేకంగా చైనా పర్యటన ఓ కుట్ర అని ఆరోపించాడు. ఐక్యరాజ్యసమితిలో కాశ్మీర్ సమస్యను లేవనెత్తకుండా ఉంచేందుకు, అవసరమైతే చైనా డిమాండ్లన్నింటినీ ఒప్పుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని విమర్శించాడు.