: రేపిస్టుల ఫోటోలు యూట్యూబ్ లో పెట్టిన ఫలితం... సామాజిక కార్యకర్తపై హైదరాబాదులో దాడి


సునీతా కృష్ణన్...ఓ సామాజిక కార్యకర్త. సమాజంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై ఆమె పోరు సాగిస్తున్నారు. ఈ క్రమంలో పలు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ నేరస్తుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ అత్యాచారానికి సంబంధించిన నిందితుల ఫొటోలను సునీతా కృష్ణన్ యూట్యూబ్ లో పెట్టారట. ఫలితం... ఆమెపై దాడి జరిగింది. తమ దుశ్చర్యలకు అడ్డుపడుతున్న వారిని ఏమీ చేయకుండా దుష్ట శక్తులు ఊరికే చేతులు ముడుచుకుని కూర్చోవుగా? ఇక్కడా అదే జరిగింది. కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో కారులో వెళుతున్న సునీతా కృష్ణన్ పై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె కారుపై రాళ్లు రువ్వారు. ఈ దాడికి పాల్పడిన వారు... యూట్యూబ్ లో ఆమె అప్ లోడ్ చేసిన వీడియోలోని వ్యక్తులేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  • Loading...

More Telugu News