: భారత్-ఆసీస్ వార్మప్ మ్యాచ్ కూ టిక్కెట్లు అయిపోయాయట!
వరల్డ్ కప్ ఫీవర్ అభిమానులను బాగా పట్టేసింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ పోటీలు ఫిబ్రవరి 14 నుంచి జరగనుండగా.... మ్యాచ్ ల టిక్కెట్లు దాదాపు అమ్ముడయ్యాయి. గ్రూప్ మ్యాచ్ లు, నాకౌట్ పోటీల సంగతి అటుంచితే, టోర్నీకి ముందు జరిగే సన్నాహక మ్యాచ్ ల టిక్కెట్లకూ విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఆదివారం జరిగే భారత్-ఆస్ట్రేలియా, పాకిస్థాన్-బంగ్లాదేశ్ మ్యాచ్ లకు టిక్కెట్లన్నీ అమ్ముడయ్యాయట. ఈ మేరకు ఐసీసీ అఫిషియల్ వెబ్ సైట్ వివరాలు పేర్కొంది. ఈ నెల 8 నుంచి 13 వరకు మొత్తం 14 వార్మప్ మ్యాచ్ లు నిర్వహించనున్నారు. ఈ ప్రాక్టీసు మ్యాచ్ లకు అడిలైడ్, క్రైస్ట్ చర్చ్, మెల్బోర్న్, సిడ్నీ వేదికలు.