: కృష్ణా జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతా: సుజనా చౌదరి


కృష్ణా జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతానని కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు. జిల్లాలో తాను దత్తత తీసుకున్న వీరులపాడు మండలం, పొన్నవరంలో ఆయన ఈరోజు పర్యటించారు. అక్కడ తాగునీటి ప్లాంటును ప్రారంభించిన మంత్రి అనంతరం మాట్లాడారు. రాష్ట్రం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నమాట వాస్తవమని చెప్పారు. ద్రవ్యోల్బణం కారణంగానే ధరలు పెంచాల్సి వస్తోందని, ప్రజలు అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. శాస్త్ర, సాంకేతిక రంగాల సంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News