: విద్యార్థులతో రొమాన్స్ వద్దు... ఉద్యోగులను ఆదేశించిన హార్వర్డ్ యూనివర్సిటీ


అమెరికాలోని అత్యంత ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీల్లో ఒకటైన హార్వర్డ్ యూనివర్సిటీ లైంగిక వేధింపుల పాలసీని సమీక్షిస్తూ, కీలక నిర్ణయాలు వెలువరించింది. ఇకపై ప్రొఫెసర్లు, ఉద్యోగులు ఎవరూ విద్యార్థులతో లైంగిక సంబంధాలు పెట్టుకోరాదని ఆదేశించింది. 'విద్యార్థులతో రొమాన్స్, సెక్స్ సంబంధాలు నిషేధిస్తున్నాం' అని వర్శిటీ యాజమాన్య కమిటీ తెలిపింది. గత కొంతకాలంగా యూనివర్సిటీలో వేధింపుల ఫిర్యాదులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, అమెరికాలో అత్యధికంగా ఫిర్యాదులు వచ్చిన వర్సిటీల జాబితాను తయారుచేయగా అందులో ఎన్నో ప్రముఖ యూనివర్సిటీలు ఉన్నాయి. ముఖ్యంగా అండర్ గ్రాడ్యుయేట్స్, ఫ్యాకల్టీల మధ్య లైంగిక సంబంధాలు అధికంగా ఉన్నాయని, వేధింపుల ఫిర్యాదుల సంఖ్యా తక్కువేమీ కాదని యూఎస్ ప్రభుత్వం తెలిపింది.

  • Loading...

More Telugu News