: మూడు రాష్ట్రాల ఆధ్వర్యంలో 'ఆపరేషన్ గజ'... ఎప్పటికి పూర్తయ్యేనో? ప్రజలకు శాంతి ఎప్పుడో?


చిత్తూరు, అనంతపురం జిల్లాలతో పాటు కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని అటవీ ప్రాంత గ్రామాల్లో బీభత్సం సృష్టిస్తున్న ఏనుగులను అడవుల్లోకి తరిమేందుకు మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు నడుం బిగించాయి. 'ఆపరేషన్ గజ' పేరిట అటవీ శాఖల అధికారులు అడవుల్లోకి కదిలారు. ఏనుగులను అడవుల్లోకి తీసుకుపోవడంలో తర్ఫీదు పొందిన గజరాజులు జయంత్, వినాయక్ లను ఇందుకోసం రంగంలోకి దింపారు. వీటిని మావటీల సాయంతో, విధ్వంసం సృష్టిస్తున్న ఏనుగుల గుంపులోకి పంపుతారు. అక్కడి ఏనుగులను ఇవి మెల్లిగా అడవులవైపు తీసుకెళ్తాయి. తమిళనాడు కృష్ణగిరి అడవులకు వీటిని పంపాలని భావిస్తుండగా, ఈ పని ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుందో మాత్రం అధికారులు చెప్పలేకపోతున్నారు. అప్పటివరకు ప్రజలు శాంతికి దూరమై, నిద్రలేని రాత్రులు గడపాల్సిందే.

  • Loading...

More Telugu News