: మార్నింగ్ వాక్ చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకున్న కవిత


మార్నింగ్ వాక్ చేస్తూ, ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడం సాధారణంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేస్తుంటారు. ఈ ఉదయం టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా ఇదే రీతిలో ప్రజలతో మమేకమయ్యారు. నిజామాబాద్ ఒకటవ డివిజన్ లో ఈ ఉదయం ఆమె మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక తాగునీటి అవసరాలు, పార్కుల ఏర్పాటు, ఇతర సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. హైదరాబాదులోని సచివాలయాన్ని తరలించాలన్న నిర్ణయాన్ని విపక్షాలన్నీ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉన్నప్పుడే, ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News