: దమ్మాలపాడు వద్ద దారి దోపిడీ... వాహనదారులను దోచుకున్న దొంగలు


ఏపీలో దారి దోపిడీలకు అడ్డుకట్ట పడడంలేదు. ఇటీవల విజయవాడ సమీపంలో దారి దోపిడీలతో కలకలం రేగగా, తాజాగా నేటి ఉదయం గుంటూరు జిల్లాలో దోపిడీ దొంగలు స్వైర విహారం చేశారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం దమ్మాలపాడు వద్ద దారి కాచిన దొంగలు అటుగా వెళుతున్న వాహనాలపై దాడులు చేశారు. వాహనాల్లో వెళుతున్న వారిని గాయపరిచి వారివద్దనున్న సొత్తును అపహరించారు. దోపిడీ దొంగల దాడిలో ఓ ఆటో, రెండు బైక్ లపై వెళుతున్న వారికి గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దోపిడీ దొంగల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News