: రోడ్డు ప్రమాదాల నివారణ ఎలా?... చంద్రబాబుతో మంత్రి శిద్ధా భేటీ
రాష్ట్రంలో నానాటికీ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలను నివారించే దిశగా ఏపీ సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రోడ్డు ప్రమాదాలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావుతో భేటీ అయ్యారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి శిద్ధాతో చంద్రబాబు చర్చిస్తున్నట్టు సమాచారం. వివిధ శాఖలు సంయుక్తంగా చర్యలు చేపడితే ప్రమాదాల నివారణ పెద్ద సమస్యేమీ కాదని భావిస్తున్న ప్రభుత్వం, ప్రధానంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు ముకుతాడు వేసే దిశగా చర్యలు చేపడుతోన్న విషయం తెలిసిందే.