: ఐర్లాండ్ బౌలింగ్ కోచ్ గా బ్రెట్ లీ... వరల్డ్ కప్ వార్మప్ పోటీల వరకే!
బ్యాట్స్ మెన్ పాలిట యముడిగా పేరుగాంచిన ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ కొత్త అవతారం ఎత్తాడు. అన్ని ఫార్మాట్ల నుంచి ఆటకు వీడ్కోలు పలికిన లీ తాజాగా ఐర్లాండ్ జట్టుకు బౌలింగ్ కోచ్ గా నియమితుడయ్యాడు. అయితే, లీ సేవలు వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ ల వరకే వినియోగించుకోవాలని ఐర్లాండ్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. దీనిపై, ఐర్లాండ్ కోచ్ ఫిల్ సిమ్మన్స్ మాట్లాడుతూ, బ్రెట్ లీకి అద్భుతమైన ఫాస్ట్ బౌలింగ్ పరిజ్ఞానం ఉందన్నాడు. ఆసీస్ పిచ్ లపై అతడి అవగాహన గ్రూప్ దశలో తమ బౌలర్లకు ఉపకరిస్తుందని అన్నాడు. ఆసీస్ జట్టుకు విశేష సేవలందించిన బ్రెట్ లీ తన కెరీర్ లో మొత్తం 76 టెస్టులాడి 310 వికెట్లు తీశాడు. అటు, 221 వన్డేలాడి 380 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.