: కుమారుడిని కొట్టినందుకు తండ్రి అరెస్ట్... రిమాండ్


కన్న కొడుకును కొట్టిన ఒక తండ్రిని హైదరాబాదు మైలార్‌ దేవ్‌ పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాబుల్‌ రెడ్డి నగర్ బస్తీకి చెందిన సురేందర్ (32), సుజాత దంపతులకు భార్గవ్ (11) అనే కుమారుడు ఉన్నాడు. సురేందర్ ఈ నెల 2న భార్గవ్‌ ను తీవ్రంగా కొట్టడంతో పన్ను విరిగింది. బాలుడు తన తల్లి సాయంతో రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సురేందర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు.

  • Loading...

More Telugu News