: పర్చూరులో ‘మార్నింగ్ స్టార్’ బీభత్సం... ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొని సైకిలిస్టు మృతి


ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సుల ప్రమాదాలు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అర్ధరాత్రి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలో కేవీఆర్ ట్రావెల్స్ కు చెందిన బస్సు టిప్పర్ ను ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోగా, నేటి ఉదయం ప్రకాశం జిల్లా పర్చూరు మండలం నాగులపాలెం వద్ద మరో ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థ మార్నింగ్ స్టార్ కు చెందిన బస్సు బీభత్సం సృష్టించింది. తన దారిన తాను వెళుతున్న ఓ సైకిలిస్టును బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సైకిలిస్టు అక్కడికక్కడే మరణించాడు.

  • Loading...

More Telugu News