: గతాన్ని దాచిపెడితే, గెలిచినా ఒడినట్టే... సుప్రీంకోర్టు హెచ్చరిక


ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ గత నేర చరితకు సంబంధించి ఎలాంటి వివరాలు దాచినా, ఆ తదుపరి తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. నామినేషన్ల దాఖలు సమయంలో నేర చరిత్రతో పాటు ఇతర తీవ్ర నేరాలకు సంబంధించిన సమాచారాన్ని దాచినా లేదా స్పష్టంగా వెల్లడించక పోయినా, ఎన్నికను రద్దు చేస్తామని, అభ్యర్థి గెలిచినా ఒడినట్టేనని తెలిపింది. అభ్యర్థులు తమ గతానికి సంబంధించిన వివరాలను వెల్లడించక పోవడం చాలా తీవ్రమైన అంశమని న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, పి.సి.పంత్‌లతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ అభిప్రాయపడింది. ఇలాంటి సమాచారాన్ని గోప్యంగా ఉంచితే ఓటర్లను తప్పుదోవ పట్టించినట్టు భావించాల్సివుంటుందని కోర్టు స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News