: ఏపీ మంత్రి గంటా ఇంటిని ముట్టడించిన విశాఖ చిరు వ్యాపారులు
ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటిని చిరు వ్యాపారులు ముట్టడించారు. విశాఖలో నేటి ఉదయం భారీ సంఖ్యలో పోగైన చిరు వ్యాపారులు నేరుగా మంత్రి నివాసానికి వెళ్లి ఆందోళనకు దిగారు. విశాఖలో ఈ- హ్యాకర్స్ జోన్ ను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉదయమే చిరు వ్యాపారులు మంత్రి ఇంటిని ముట్టడించడంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. ప్రస్తుతం మంత్రి ఇంటి ఎదుట చిరు వ్యాపారుల ఆందోళన కొనసాగుతోంది. చిరు వ్యాపారులను అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.