: అర్ధరాత్రి అమ్మాయిల ఆందోళన... ఉస్మానియాలో కలకలం!
తమ సమస్యలు తక్షణం పరిష్కరించాలంటూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థినులు రాత్రిపూట ఆందోళనకు దిగడం ఈ ప్రాంతంలో కలకలం రేపింది. తమను ఎన్నో సమస్యలు వేధిస్తున్నాయని, హాస్టల్ లో వసతులు సరిగ్గాలేవని ఆరోపిస్తూ, విద్యార్థినులు ధర్నా చేశారు. నీటి సమస్య, సెక్యూరిటీ సమస్య వేధిస్తోందని, వీటిపై పలుమార్లు అధికారులకు వివరించినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్శిటీ ఉన్నతాధికారులు వచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో వారు నిరసనను విరమించారు.