: హైటెక్స్ కు క్యూకట్టిన సినీ, రాజకీయ ప్రముఖులు
హైదరాబాదులోని హైటెక్స్ కు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు క్యూకట్టారు. హైటెక్స్ లో ప్రముఖ పారిశ్రామిక వేత్త, మాజీ ఎంపీ టీ సుబ్బరామిరెడ్డి మనవడు రాజీవ్ రెడ్డి, కావ్యల వివాహం జరిగింది. ఈ వివాహానికి పెద్దసంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు సందడి చేశారు. సుబ్బరామిరెడ్డి మనవడ్ని ఆశీర్వదించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా ఇతర పార్టీల నేతలు తరలి వెళ్లగా, ప్రముఖ నటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి కూడా హాజరయ్యారు. వివాహ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా బాలీవుడ్ డ్రీం గర్ల హేమామాలిని నృత్యం నిలిచింది. వివాహ వేడుకలో ప్రముఖ సంగీత దర్శకుడు శంకర్, ఎహసాన్, లాయ్ సంగీత రవళి వినిపించారు. ఈ సందర్భంగా సుబ్బరామిరెడ్డి హేమామాలిని, శంకర్, ఎహసాన్, లాయ్ లను దుశ్శాలువతో సత్కరించారు.