: ఖజానా ఖాళీ...అప్పులు తెస్తున్నాం: యనమల


ఆంధ్రప్రదేశ్ ఖజానా ఖాళీ అయిందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని నడిపేందుకు అప్పుడప్పుడు కోట్లు అప్పు తీసుకుంటున్నామని అన్నారు. రాష్ట్ర విభజన సమస్యలన్నీ ఆంధ్రప్రదేశ్ మీదే పడ్డాయని ఆయన తెలిపారు. సంక్షేమ కార్యక్రమాల వల్ల రాష్ట్ర ఖజానాపై 5 వేల కోట్ల భారం పడిందని ఆయన పేర్కొన్నారు. ఏపీకి నిధులు కేటాయిస్తున్నట్టు కేంద్రం నెట్ లో పేర్కొందని తెలిపిన ఆయన, రాష్ట్రానికి నిధులు విడుదల చేస్తున్నట్టు తనకు ఎలాంటి సమాచారం లేదని అన్నారు. రాష్ట్రానికి నిధులు విడుదల చేస్తే మంచిదేనని పేర్కొన్న ఆయన, పునర్వ్యవస్థీకరణ బిల్లులో పేర్కొన్న ప్రకారం తమకు రాయితీలు కల్పించాలని, నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లనున్నారని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News