: చాక్ పీస్ పై జాతీయ గీతం...బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు
చాక్ పీస్ పై జాతీయ గీతం చెక్కిన పల్లిమక్తె గ్రామ ప్రైమరీ స్కూలు ఉపాధ్యాయుడు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన కాపిర్ల నరేష్ (30) వినూత్న ప్రయత్నంతో తన ప్రతిభ చాటుకున్నారు. చాక్ పీస్ పై మూడు రంగుల్లో జాతీయ గీతాన్ని చెక్కారు. దీంతో అతని ప్రతిభను గుర్తించిన బుక్ ఆఫ్ స్టేట్స్ రికార్డ్స్ ప్రతినిధులు, ఆయనకు ప్రశంసాపత్రం అందించారు. తన ప్రతిభకు గుర్తింపు లభించినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు.