: ఢిల్లీ ఓట్లు మోదీ పాలనకు కొలమానం కాదు: అమిత్ షా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా అవి ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు కొలమానం కాబోవని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, సర్వేల సంగతి ఎలా ఉన్నప్పటికీ బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని, కిరణ్ బేడీ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. కాగా, మరో రెండు రోజుల్లో ఢిల్లీలో ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే.