: తెలంగాణ ఉద్యోగులకు 43 శాతం పీఆర్సీ ప్రకటన


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వేతన సవరణను ప్రకటించింది. అంతకుముందు తెలంగాణ ఉద్యోగులతో చర్చించిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగులకు వేతన ఫిట్ మెంట్ ను 43 శాతంగా నిర్ణయించినట్టు సమావేశంలో తెలిపారు. జూన్ 2, 2014 నుంచి వర్తించేలా వేతన సవరణ ఉంటుందని వెల్లడించారు. బకాయిలన్నీ జీపీఎఫ్ ఖాతాలోకి వెళతాయని, మార్చి నెలలో కొత్త జీతాలు వేస్తామని వివరించారు. ఈ మేరకు పిఆర్సీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రేపు జీవో జారీ చేయనుంది. పీఆర్సీ సవరించినందుకు తెలంగాణ ఉద్యోగులు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపి, స్వీట్ తినిపించారు. గతంలో పీఆర్సీలో 39 శాతం పిట్ మెంట్ గా ఉండేది.

  • Loading...

More Telugu News