: ట్యూన్స్ అన్నీ స్టూడియోలో ఉన్నాయి... తెరిపించండి: వదినపై చక్రి సోదరుడు ఫిర్యాదు
టాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్ చక్రి మరణించిన తర్వాత మొదలైన వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. చక్రి ఆస్తులు తమకు చెందాలంటే, తమకు చెందాలని కుటుంబ సభ్యులు వీధికెక్కడం తెలిసిందే. చక్రి భార్య శ్రావణికి వ్యతిరేకంగా చక్రి సోదరుడు, తల్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తే... శ్రావణి అత్తింటివారిపై ఫిర్యాదు చేసింది. ఇటీవల చక్రి స్టూడియోను ధ్వంసం చేశారంటూ మరో రగడ! ఈ క్రమంలో చక్రి సోదరుడు మహిత్ నారాయణ తన వదినపై తాజాగా బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన సోదరుడికి చెందిన స్టూడియోలో తన ట్యూన్స్ ఉన్నాయని, అందుకే ఆ స్టూడియోను తెరిపించాలని కోరాడు. తాను కొన్ని సినిమాలకు పనిచేస్తున్నానని, ట్యూన్స్ అవసరమని, స్టూడియోకు వేసిన తాళం తెరిపించాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు.