: బీజేపీలో చేరిన మరో నటి
మోదీ మాయాజాలమో, లేక మరో కారణమో తెలియదు కానీ... ఈ మధ్య కాలంలో బీజేపీలో సీనీ కళ ఉట్టిపడుతోంది. ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అన్న తేడా లేకుండా సినీ కళామతల్లి ముద్దు బిడ్డలు చాలా మంది కాషాయ కండువా కప్పుకునేందుకు ఉబలాటపడుతున్నారు. ఈ క్రమంలో, పశ్చిమ బెంగాల్ వెండి తెరపై తన అందచందాలతో మైమరపించిన నటి 'లాకెట్ చటర్జీ' తృణమూల్ కు గుడ్ బై చెప్పి, బీజేపీలో చేరిపోయింది. రానున్న ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో ఎలాగైనా పాగా వేయాలనే ఆలోచనలో ఉన్న బీజేపీ కూడా, ఆమెను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించింది. మహిళా కమిషన్ మెంబర్ గా కూడా వ్యవహరిస్తున్న చటర్జీ ఆ పదవిని కూడా వదులుకుని బీజేపీలో చేరడం గమనార్హం.