: టీవీ టవర్ ను ఢీకొట్టి కూలిపోయింది!
విమాన ప్రయాణం అంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. రోడ్లపై బైక్ యాక్సిండెంట్లలా విమాన ప్రమాదాలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. తైవాన్ లోని తైపీ నదిలో విమానం కూలిన ఘటన మరువకముందే అమెరికాలో మరో విమానం కూలి కలకలం రేపింది. టెక్సాస్ లోని ప్రెస్టాన్ స్మిత్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సింగిల్ ఇంజన్ పీఏ-46 విమానం ల్యాండ్ అయ్యే సమయంలో టీవీ టవర్ ను ఢీకొట్టి కుప్పకూలింది. దీంతో, విమానంలో ప్రయాణిస్తున్న పైలట్ సహా మరో వ్యక్తి మృతి చెందినట్టు విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి.