: భారతీయ యువతులకు తగిన భర్త రావడం కష్టమేనట!


భారతీయ యువతులకు భవిష్యత్ లో పెద్ద కష్టమే ఎదురుకానుందని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. యూనివర్సిటీ, కాలేజీ స్థాయి చదువు పూర్తిచేసిన భారతీయ యువతులకు సరైన సంబంధాలు దొరకడం కష్టమని వారు పేర్కొంటున్నారు. భారత్ లో పురుషులు సాధారణంగా తమకంటే తక్కువ విద్యావంతులనే వివాహమాడేందుకు మొగ్గుచూపుతారని వారు పేర్కొన్నారు. ఆ లెక్కన భారత్ లో మహిళలు విద్యలో రాణిస్తూ సత్తా చాటుతున్నారని... పురుషులకంటే మెరుగైన విద్యతో యువతులు దూసుకుపోతుండడంతో, తమకంటే విద్యావంతులను యువకులు వివాహం చేసుకునేందుకు మొగ్గుచూపే అవకాశం లేదని విశ్లేషించారు. 2010 నాటికి యూనివర్సిటీలో చదువుతున్న ప్రతి 151 మంది పురుషులకు 100 మంది యువతులు కళాశాలల్లో చదువుతూ అందుబాటులో ఉన్నారని, అదే 2050 నాటికి పరిస్థితి ఇలా ఉండకపోవచ్చన్నది ఆక్స్ ఫర్డ్ పరిశోధన సారాంశం. భవిష్యత్తులో సరైన జోడీ కోసం యువతుల అన్వేషణ క్లిష్టం కానుంది.

  • Loading...

More Telugu News