: హైదరాబాద్ ను చెత్త నగరం అంటూ... బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీస్తున్నారు: కేసీఆర్ పై పొన్నాల ఫైర్
సంస్కృతి, సంప్రదాయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ కాలరాస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. హైదరాబాదులో అభివృద్ధి లేదంటూ, చెత్త, పిచ్చి అంటూ... హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో డెవలప్ అయిన హైదరాబాద్ ను చెత్త నగరం అనడం ఏమిటని ప్రశ్నించారు. సచివాలయాన్ని ఎర్రగడ్డకు మారుస్తామంటున్న కేసీఆర్... ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే పనులు చేపడుతున్నారని ఆరోపించారు. హైదరాబాదుకు బెస్ట్ సిటీ అవార్డు వచ్చిందని... ఆ అవార్డును కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అందుకున్న విషయాన్ని గుర్తు చేశారు.