: సునంద పుష్కర్ కుమారుడిని ప్రశ్నించిన సిట్


అనుమానాస్పద రీతిలో మరణించిన సునంద పుష్కర్ కేసులో ఆమె కుమారుడు శివ్ మీనన్ ను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అధికారులు ప్రశ్నించారు. దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్ కు మీనన్ ఈ మధ్యాహ్నం చేరుకున్నారు. సిట్ అధికారులు రెండు గంటలకు పైగా మీనన్ ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మీనన్ కు తాము సమన్లు జారీ చేశామని, అందుకే అతడు ఢిల్లీ వచ్చాడని నగర పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ నిన్న తెలిపారు.

  • Loading...

More Telugu News