: వాస్తు బాగాలేదని చార్మినార్ ను కూడా మార్చేస్తారేమో: కేసీఆర్ పై వీహెచ్ విసుర్లు


సెక్రటేరియట్ కు వాస్తు బాగాలేదని చెబుతూ, ఎర్రగడ్డలోని చెస్ట్ ఆసుపత్రిలో కొత్త సచివాలయాన్ని నిర్మిస్తామన్న టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ వి.హనుమంతరావు మండిపడ్డారు. కేసీఆర్ కు వాస్తు పిచ్చి పట్టుకుందని... వాస్తు బాగా లేదని చార్మినార్ ను కూడా మారుస్తారేమో అని ఎద్దేవా చేశారు. తెలంగాణకు రావాల్సిన ప్రత్యేక నిధుల కోసం ప్రధాని నరేంద్ర మోదీని కేసీఆర్ డిమాండ్ చేయాలని అన్నారు. ఇదే సమయంలో బీజేపీపై కూడా వీహెచ్ మండిపడ్డారు. ఇప్పుడిప్పుడే బీజేపీ బండారం బయటపడుతోందని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు రెఫరెండం కాదని ఆ పార్టీ నేతలు చెప్పడం వారి భయాన్ని సూచిస్తోందని దెప్పిపొడిచారు.

  • Loading...

More Telugu News