: జాతీయ క్రీడల్లో తెలంగాణకు స్వర్ణ పతకం


కేరళలో జరుగుతున్న జాతీయ క్రీడల్లో నవ తెలంగాణ రాష్ట్రం తొలి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. రోయింగ్ విభాగంలో తెలంగాణకు చెందిన మంజీత్ సింగ్, దేవేందర్ సింగ్ లు స్వర్ణపతకం సాధించారు. దీంతో, జాతీయ క్రీడల్లో తెలంగాణ తరపున తొలి స్వర్ణం గెలిచిన క్రీడాకారులుగా వీరు చరిత్ర పుటల్లోకి ఎక్కారు. మరోవైపు, స్వర్ణ పతకం కైవసం చేసుకుని, తెలంగాణకు గౌరవం తీసుకువచ్చిన వీరిద్దరికీ టీఎస్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అభినందనలు తెలియజేశారు.

  • Loading...

More Telugu News